ఉజ్వల పార్కు పరిశీలన
ఉజ్వల పార్కు పరిశీలన
కరీంనగర్, శోధన న్యూస్: పర్యాటకులను ఆకట్టుకునేలా ఉజ్వల పార్కును తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పర్యాటక శాఖ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ లోని ఉజ్వల పార్కును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులో కలియ తిరిగారు. ఉజ్వల పార్కు నిర్వహణ తీరు.. సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆహ్లాదం కోసం వచ్చే పర్యాటకుల కోసం పార్కును అందంగా తీర్చిదిద్దాలని సిబ్బందికి సూచించారు. పార్కు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని రకాల మొక్కలు, గార్డెన్ సంరక్షణకు కృషి చేయాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం చేయవద్దని, సెలవు రోజుల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారని, ఈ మేరకు సిబ్బంది చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆదరణ పెరిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు మొక్కలు, ఫౌంటేన్ల వద్ద పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు. వాటర్ షూట్ ను పరిశీలించారు. పార్కులో ఉన్న జగన్నాథ ఆలయాన్ని జిల్లా కలెక్టర్ దర్శించుకున్నారు.