జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు.
కొత్తగూడెం, శోధన న్యూస్:భద్రాద్రి కోత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల జిల్లా ప్రజలకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. నెలవంక రాకతో ప్రారంభమైన రంజాన్ మాసం మళ్లీ నెలవంక దర్శనంతో ముగుస్తుందని చెప్పారు. దాతృత్వం, ధార్మిక చింతన కలయిక పవిత్ర రంజాన్ మాసమని ఆమె అన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిన రంజాన్ మాసమును ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారని ఈ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలు , ఆధ్యాత్మిక చింతన ,దాన ధర్మాలు చేపడతానన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆమె ఆకాంక్షించారు.