మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలి
మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలి
-కలెక్టర్ ఇలా త్రిపాఠి
ములుగు, శోధన న్యూస్: నర్సరీ, ఎవెన్యూ ప్లాంటేషన్ లలో మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని, రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున మొక్కలను పెంపకం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అన్నారు. కలేక్టరేట్ కాన్ఫరెన్స్ హల్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి ఉష్ణోగ్రతల వల్ల నర్సరీల్లో మొక్కలు చనిపోయే ప్రమాదం ఉందని, జిల్లాలోని అన్ని నర్సరీలలో జామ, అల్లనేరేడు, అలోవెరా వంటి మొక్కలను పెంచాలని సూచించారు. మొక్కలు పెంపకం చేసే ప్రదేశాలలో కార్మికులకు తాగునీరు, టెంట్ ఏర్పాటు చేయాలని, ఉపాధి హామీ పథకంలో అన్ని మండలాల్లో ఎక్కువ పని దినాలు కల్పించే విధంగా చూడాలన్నారు. ఉపాధి హామీ పధకం ద్వారా జరిగిన పనులకు కార్మికులకు, మెటీరియల్ కు వారంలోగా డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని బృహత్ పల్లె ప్రకృతి వనాలలో మొక్కలు చనిపోతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని త్రిపాటి హెచ్చరించారు.