మత్తు నుండి యువతను కాపాడాలి
మత్తు నుండి యువతను కాపాడాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
వరంగల్,శోధన న్యూస్: నేటి యువతను మత్తు పదార్థాలకు బానిస కాకుండా కాపాడుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం వల్ల జరిగే అనర్థాలపై రూపోందిన వాల్ పోస్టర్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులతో కల్సి అవిష్కరించారు. రాష్ట్రంలో గంజాయితో పాటు కల్తీ కల్లు వినియోగం ద్వారా వ్యక్తులతో పాటు సమాజానికి జరిగే నష్టాన్ని తెలిపే రీతి రూపోందించిన ఈ వాల్‌పోస్టర్‌లో గంజాయి, కల్తీ కల్లు విక్రయాలకు పాల్పడితే ఫిర్యాదు చేయాల్సిన టోల్ ఫ్రీ నంబర్‌తో ఈ అవగాహన పోస్టర్లను రూపోందించడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గంజాయి మహమ్మారి యువతను పట్టిపీడిస్తోంది. తద్వారా వారి జీవితాలు విచ్చిన్నం కావడంతో పాటు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురైవుతున్నారని. గంజాయి నిర్మూలనకు ప్రజలందరు స్వచ్చందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా వుంచబడుతాయని. అధే విధంగా మత్తు పదార్థాల కట్టడి కోసం పోలీస్ అధికారులు మరింత శ్రమించించాల్సిన వుందని. గంజాయి రహిత కమిషనరేట్ మనందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.