ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వచ్చాను
ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వచ్చాను
-మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి
అశ్వాపురం, శోధన న్యూస్: అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామంలో శుక్రవారం మొండికుంట మాజీ సర్పంచ్, నెల్లిపాక మాజీ సొసైటీ చైర్మన్ మర్రి మల్లారెడ్డి తన తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఉన్నత చదువులు చదువుకొని కూడా ఉద్యోగానికి పోకుండా ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాలకు వచ్చానని అన్నారు,మొండికుంట గ్రామపంచాయతీ అభివృద్ధిలో నేనెక్కడ రాజీ పడలేదని నేను చేసిన అభివృద్ధి గ్రామపంచాయతీలో కళ్లకుగట్టేలా కనబడుతుందని ఎవరో కొంతమంది వ్యక్తులు కావాలని నా పైన వ్యక్తిగతంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ అవాకులు చవాకులు పేలునంత మాత్రాన నిజం అబద్ధం అవుతుందా అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు నాకు ప్రజలు ఓట్లేసి పదవి బాధ్యతలు అప్పజెప్పితే ఆ పదవులకు రాజకీయాల అతీతంగా 100 కి 100 శాతం న్యాయం చేశానని అన్నారు ,నేను అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని ప్రజలు నాలుగు కాలాలపాటు గుర్తుండిపోయేలా పనిచేశానని, కానీ నేను డబ్బు సంపాదించాలనుకుంటే రాజకీయాలే అవసరం లేదు, నాకు సొంత వ్యాపారాలు చాలా ఉన్నాయి కానీ నేనెప్పుడూ డబ్బు సంపాదన కోసం రాజకీయాలకు రాలేదని గ్రామంలో ప్రజల అవసరాలు తెలుసుకొని అనేకసార్లు నా సొంత డబ్బులతో అనేక సందర్భాలలో గ్రామాన్ని అభివృద్ధి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. ఇకనైనా ఇలాంటి అబద్ధపు నిరాధారమైన ఆరోపణలు మానుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసే విషయంలో పోటీ పడాలని ఆయన హితవు పలికారు.