ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి.
ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి
హుజురాబాద్,శోధన న్యూస్:ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని హుజురాబాద్ సీఐ బొల్లం రమేష్ అన్నారు. హుజురాబాద్ మండలం జూపాక, చెల్పూర్ గ్రామాలలో శనివారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించాలనుకుంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. వాట్సాప్ లలో అభ్యంతరకర పోస్టులను షేర్ చేయవద్దని యువతకు సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.