పిల్లలకు చదువుతోనే భవిష్యత్
పిల్లలకు చదువుతోనే భవిష్యత్
-ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మౌనిక
మహబూబాబాద్ ,శోధన న్యూస్: పిల్లలకు చదువుతోనే బంగారు భవిష్యత్ అని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మౌనిక తెలిపారు. 14 సంవత్సరాల లోపు పిల్లలందరు తప్పకుండా చదువుకోవాలని,వారు పనిలో కాకుండా పాఠశాలలో ఉండాలని,అలాయితేనే అంబేద్కర్ కలలుకన్న భారతదేశం సాక్షాత్కరిస్తుందని,బావి భారత పౌరులైన చిన్న పిల్లలకు భారత రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించబడ్డాయని అందులో చూపించబడిన హక్కులన్ని అందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఈరోజు జిల్లా న్యాయసేవాధికార సంస్థ, మహబూబాబాద్ వారి ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రారు కార్యాలయ సమీపంలోని ఆశాభవన్ మరియు వేర్పుల సత్యం కాలనీలో గల దైవకృప అనాధ పిల్లల శరణాలయాల్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మౌనిక పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్జి పిల్లలకు పండ్లు పంచిపెట్టారు.