అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం…
అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం…
మణుగూరు, శోధన న్యూస్ : ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133 వ జయంతి వేడుకలు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత మణుగూరు జెడ్పీటీసి పోశం నరసింహారావు, బిఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ,భారత దేశం గర్వించదగ్గ నేత,బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి,భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవితం అంతా అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం,దేశ భవిష్యత్తు కోసం ,నిరంతరం కృషి చేశారని,దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.