అగ్ని ప్రమాదాల తో అప్రమత్తంగా ఉండాలి
అగ్ని ప్రమాదాల తో అప్రమత్తంగా ఉండాలి
సంగారెడ్డి ,శోధన న్యూస్: అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను, గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కలెక్టరేట్ కార్యాలయం లోని తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తతో కూడిన ముందు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. విపత్తులు గోదాములలో, షాపింగ్ మాలలలో, పాఠశాల లలో సినిమా థియేటర్లలో, ఆసుపత్రులలో, తదితర ప్రదేశాలలలో ప్రమాదాలు జరగకుండా యజమానులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజులపాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను అగ్నిమాపక శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.