తెలంగాణవరంగల్

నాలాల్లో డీ సిల్టింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి

నాలాల్లో డీ సిల్టింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి

వరంగల్ ,శోధన న్యూస్: నాలాల్లో డీ సిల్టింగ్ ప్రక్రియ చేపట్టి వేగవంతం గా పూర్తి చేయాలనీ బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయి పరిశీలన లో భాగం గా సోమవారం నగర పరిధి లోని పద్మాక్షి కాలనీ రోడ్ శ్యాయంపేట బొంది వాగు నాలా రైల్వే ట్రాక్ అవతలి వైపు గల ప్రాంతం మేదరి వాడ రైల్వే ట్రాక్ వెంట్స్ ప్రాంతం కీర్తి బార్ ఏరియా, శాకరాసి కుంట, జన్మభూమి జంక్షన్, మైసయ్య నగర్, శివ నగర్, స్మశాన వాటిక ప్రాంతాల్లో కమీషనర్ పర్యటించి పరిశీలించారు. పద్మాక్షి కాలనీ శాయం పేట వద్ద కాంట్రాక్టర్ నిలిపివేసిన స్మార్ట్ సిటీ రోడ్డు పనుల ను పరిశీలించిన కమీషనర్ వెంటనే అట్టి పనులను కొనసాగించేలా చూడాలని ఎస్ ఈ నీ ఆదేశించారు. అనంతరం వరంగల్ నగర పరిధి బొంది వాగు నాలా ను పరిశీలించి వరద ప్రభావం వల్ల ఎదురయ్యే సమస్యలను అధికారులను అడిగి తెలుసుకొని డీ సిల్టింగ్ ప్రక్రియ ప్రారంభించి నీటి ప్రవాహం నకు అడ్డంకులు లేకుండా చూడాలని , కీర్తి బార్ నుండి గవిచర్ల క్రాస్ రోడ్డు వరకు సుమారు 3 కిలో మీటర్ ల మేర నిర్మిస్తున్న స్మార్ట్ రోడ్డు పనులను వేగం గా పూర్తి చేయాలనీ అన్నారు.జన్మ భూమి జంక్షన్ సమీపం లో డ్రైన్ ను పరిశీలించిన కమీషనర్ డ్రైన్ లో పేరుకు పోయిన చెత్త ను తొలగించాలని సి ఎం హెచ్ ఓ ను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభం అయ్యే నాటికి నాలాల్లో డీ సిల్టింగ్ ప్రక్రియ పూర్తి చేసి వరద ప్రభావానికి లోను కాకుండా నీరు సాఫీగా వెళ్లి పోయేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *