శ్రీరామ పట్టాభిషేకానికి గవర్నర్ రాక
నేటి శ్రీరామ పట్టాభిషేకానికి గవర్నర్ రాక
-ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా
బూర్గంపాడు, శోధన న్యూస్ : నేడు గురువారం జరగనున్న శ్రీరాముని మహా పట్టాభిషేకం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ విచేయనున్నందున విధులు కేటాయించిన అధికారులు ఉదయం 6 గంటలకే కేటాయించిన విధులకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. గవర్నర్ పర్యటనపై బుధవారం ఐటీసీ విశ్రాంతి భవనంలో రెవెన్యూ, డిఆర్ డిఎ, జడ్పి, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరామ వేడుకలకు విధులు కేటాయించిన సెక్టార్ల అధికారులు సకాలంలో సెక్టార్లకు చేరుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారని, మహా పట్టాభిషేకం కార్యక్రమాలకు కూడా స్పూర్తితో ఉదయం 6 గంటలకు సెక్టార్లకు చేరుకొని ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆమె పేర్కొన్నారు. గవర్నర్ టైం టు టైం షెడ్యూల్ ఫాలో కావాలని ఆమె అధికారులను ఆదేశించారు.