శ్రీరామనవమి మహోత్సవ వేడుకల విజయవంతం పట్ల హర్షం
శ్రీరామనవమి మహోత్సవ వేడుకల విజయవంతం పట్ల హర్షం
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం వేడుకలు అత్యంత వైభవో పేతంగా జరగడం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల హర్షం వ్యక్తం చేశారు. వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులకు ఏర్పాట్లు చేసేందుకు అధికారులకు కేటాయించిన విధులను సమన్వయంతో పూర్తి చేసి భక్తుల మన్ననలు పొందారని ఆమె తెలిపారు. ఉత్సవాలు దిగ్విజయంగా జరుగుటలో భక్తులు ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటిస్తూ సహకరించారని అన్నారు. మహోత్సవ వేడుకల సమాచారం ఎప్పటి కపుడు భక్తులకు అందించిన పాత్రికేయులను కలెక్టర్ అభినందించారు.