పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్ డిఓ
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్ డిఓ
మధిర, శోధన న్యూస్ : మధిర మండల పరిధిలోని దెందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని ఖమ్మం ఆర్ డిఓ గణేష్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రంలో నాలుగు ఫ్యాన్లు, నాలుగు ట్యూబ్ లైట్లు, చార్జింగ్ పెట్టేందుకు సాకెట్లు తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేసి అందులో నీళ్లు, విద్యుత్ సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ప్రతి ప్రాథమిక పాఠశాలకి 25 వేల రూపాయలు, ఉన్నత పాఠశాలకు లక్ష రూపాయలు అడ్వాన్సుగా మంజూరు చేయటం జరిగిందన్నారు. ఆయన వెంట తహసిల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.