ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి
ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని ఆర్ డి ఓ ఆఫీస్ లో గల ఈవీఎం గోదామును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా శనివారం అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి పరిశీలించారు. అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు ఈవీఎం యంత్రాలను తరలిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న 5 అసెంబ్లీ సెగ్మెంట్ల స్ట్రాంగ్ రూమ్ లకు మొదటి ఈవిఎం ర్యాండమైజేషన్ లో కేటాయించిన ఈవిఎం యంత్రాలను తరలిస్తున్నామని, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ కు కేటాయించిన 316 బ్యాలెట్ యూనిట్లు, 316 కంట్రోల్ యూనిట్లు, 354 వివిప్యాట్లు, రామచంద్ర డిగ్రీ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పర్చడం జరుగుతుందని అన్నారు. భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ కు కేటాయించిన 225 బ్యాలెట్ యూనిట్లు, 225 కంట్రోల్ యూనిట్లు, 252 వివిప్యాట్లు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో, అశ్వరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ కు కేటాయించిన 230 బ్యాలెట్ యూనిట్లు, 230 కంట్రోల్ యూనిట్లు, 257 వివిప్యాట్లు అశ్వరావుపేటలోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ కాలేజీలో భద్ర పర్చడం జరుగుతుందని, ఇల్లందు అసెంబ్లీ సెగ్మెంట్‌కు కేటాయించిన 302 బ్యాలెట్ యూనిట్లు,302 కంట్రోల్ యూనిట్లు,338 వివి ప్యాడ్లు, ఇల్లందు సింగరేణి బాలికల పాఠశాలలో భద్రపరిచినట్లు, పినపాక అసెంబ్లీ సిగ్మెంటు కేటాయించిన 312 బ్యాలెట్ యూనిట్లు,312 కంట్రోల్ యూనిట్లు,350 వివి ప్యాట్లు మణుగూరుజిల్లా పరిషత్ హైస్కూల్లో భద్రపరిచినట్లు కలెక్టర్ తెలిపారు.