కొత్త వ్యక్తులు వస్తే సమాచారం అందించండి
కొత్త వ్యక్తులు వస్తే సమాచారం అందించండి
-కరకగూడెం ఎస్సై రాజేందర్…
-వలస ఆదివాసి గ్రామాల సందర్శన.
-తాగునీటి సమస్యలు లేకుండా తీరుస్తాం..
కరకగూడెం, శోధన న్యూస్: కొత్త వ్యక్తులు వస్తే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని కరకగూడెం ఎస్ఐ రాజేందర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని ఆదివాసి గ్రామాలను ఎస్ఐ రాజేందర్ తమ సిబ్బందితో పరిశీలించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు, ఆదివాసి గూడాలలో అన్ని వసతులు కల్పిస్తున్నారని ఆయన అన్నారు. గ్రామాలలో కొత్త వ్యక్తులు ఎవరు వచ్చిన తమకు తెలియజేయాలని గ్రామ పెద్దలను ఆయన కోరారు. గ్రామాలలో ఉన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఆదివాసి గ్రామాలలో వేసవికాలంలో నీటి కొరత లేకుండా అన్న చర్యలు చేపడతామని అని అన్నారు. ఆదివాసి యువకులు అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలని యువకులు విద్య ఆటల వైపు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆదివాసి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.