తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఇంటర్ ఫలితాలలో జిల్లాకు రాష్ట్రస్థాయి ర్యాంక్ పట్ల హర్షం

ఇంటర్ ఫలితాలలో జిల్లాకు రాష్ట్రస్థాయి ర్యాంక్ పట్ల హర్షం 

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో భద్రాద్రి జిల్లా రాష్ట్ర స్థాయిలో తొమ్మిదవ  స్థానంలో ర్యాంక్  సాధించడం  పట్ల భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఫలితాలు ప్రకటించిన సందర్భంగా ఇంటర్మీడియట్ అధికారి సులోచనా రాణిని ఫలితాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4015 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 2491 మంది, 5276 మంది బాలికలు హాజరు కాగా 4065 మంది మొత్తం 9291 మంది పరీక్షలకు హాజరు కాగా 6556 మంది ఉత్తీర్ణతతో 70.56 శాతంతో రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు . మొదటి సంవత్సరంలో 4563 మంది బాలురు హాజరు కాగా 2016 మంది, 5643 మంది బాలికలకు 3580 మంది మొత్తం 10206 హాజరుకాగా 5596 ఉత్తీర్ణత తో 54.84 శాతం సాధించినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం వృత్తి విద్యా కోర్సులో 1163 మంది బాలురు హాజరు కాగా 434 మంది, 1272 మంది హాజరు కాగా 780 మంది మొత్తం 2435 మంది విద్యార్థులు హాజరు కాగా 1214 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. వృత్తి విద్యా కోర్సు 2వ సంవత్సరంలో 846 మంది బాలురకు 542 మంది, 1095 మంది బాలికలకు 889 మంది మొత్తం 1941 మంది విద్యార్థులు హాజరు కాగా 1431 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధనకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులను, అధ్యాపకులను, సిబ్బందిని ఆమె అభినందించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కలగాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *