తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు శిక్షణ

 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు శిక్షణ

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో నియోజకవర్గ ,మండల స్థాయి ఎస్ ఎస్ టి, ఎఫ్ ఎస్ టి, పోలీస్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ అన్ని చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలన చేయాలని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా నిరంతరంగా పరిశీలించాలని ఆమె తెలిపారు. ఎం సి సి లో ఎఫ్ ఎస్ టి, వి ఎస్ టి లో మోడల్ కండక్ట్ కోడ్ ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలను నివేదికల అందించాలని ఆమె తెలిపారు. ఎటువంటి సంఘటననైనా సీసీ కెమెరాలు ద్వారా పరిశీలించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా డబ్బు మద్యం తదితర వస్తువులు పట్టుబడిన సందర్భంలో వీడియో రికార్డింగ్ తప్పనిసరిగా చేయాలని ఆమె తెలిపారు. రాజకీయ పార్టీలు మీటింగ్స్, బ్యానర్లు మొదలైన సామాగ్రిపై వీడియో సర్వే లైన్స్ టీం రికార్డు చేయాలని ఆమె తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజలు 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి ఉందని, 50 వేలకు పైబడి నగదుకు ఆధారాలు చూపించాలని ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *