తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి 

సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి 

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్  ప్రియాంక అలా

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : మే  13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్  ప్రియాంక  అలా అధికారులను ఆదేశించారు.  సోమవారం  ఐ టి ఓ సి సమావేశ మందిరంలో జిల్లాలోని ఏ ఆర్ ఓ లు, ఆర్డీవోలు, తాసిల్దారులు,ఎంపీడీవోలు, ఎఫ్ ఎస్ టి టీమ్లు, ఎస్ ఎస్ టి టీంలు, వి ఎస్ టి టీంలు, మున్సిపల్ కమిషనర్లు, మరియు పోలీస్ సిబ్బందితోఎన్నికల ఏర్పాట్లు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ… పోలింగ్ కేంద్రాలలో ఉన్న మౌళిక వసతులు, దివ్యాంగుల కోసం చేసిన ఏర్పాట్లు, త్రాగు నీటి సౌకర్యం, విద్యుత్, టాయ్లెట్ సౌకర్యం ఉన్నదా లేదా పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతల దృశ్య ప్రతి పోలింగ్ కేంద్రం ముందు విధిగా షామియానాలు మరియు త్రాగునీరు ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని పరిస్థితులను ముందుగానే గమనిస్తూ, ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హకు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఎవరైనా అలసత్వాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. పోలింగ్‌ రోజున ఓటింగ్‌ శాతాన్ని ఎప్పటికప్పుడు ఎన్‌ కోర్‌ యాప్‌లో ఎంట్రీ చేయాలన్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలింగ్ రోజువిధులు నిర్వహించే సిబ్బంది కి త్రాగునీరు, భోజనాల ఏర్పాట్లు అధికారులను ఆదేశించారు. పోలింగ్ అనంతరం నిర్దేశించిన రూట్ మ్యాప్ ద్వారా మాత్రమే ప్రిసైడింగ్ అధికారి పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య ఈవీఎంలను తరలించాలని అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జరుగుతున్న పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ముందుగా ఎన్నికల పోలింగ్ కేంద్రాలు నిర్వహించే పాఠశాలల్లో త్రాగునీరు, ఫ్యాన్లు తదితర మౌలిక సదుపాయాలను సత్వరమే పూర్తి చేసి నివేదికలను అందించాలని కలెక్టర్ అధికారులనుఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *