పిఓ, ఏపిఓలకు శిక్షణ
పిఓ, ఏపిఓలకు శిక్షణ
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ఈ నెల 30 వ తేదీ నుండి మే 3 వ తేదీ వరకు పిఓ, ఏపిఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. కొత్తగూడెం, అశ్వారావుపేట పిఓ, ఏపిఓ, ఓపిఓ లకు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ సిబ్బంది శిక్షణ నిమిత్తం కొత్తగూడెం, అశ్వారావుపేట పిఓ, ఏపిఓ, ఓపిఓలు ఈ నెల 30, మే 01, 02, 03 తేదీలలో ఖమ్మం పట్టణం లోని ఎస్ ఆర్ అండ్ బిజీఎన్ఆర్ కాలేజ్ నందు హాజరు కావాలని ఆమె తెలిపారు. శిక్షణ ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. పై వారందరూ ఎవరికి కేటాయించిన తేదీలలో వారు తప్పనిసరిగా శిక్షణా కార్యక్రమానికి హాజరు కావాలని తెలిపారు. భద్రాచలం, పినపాక , ఇల్లందు పిఓ, ఏపిఓలు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ సిబ్బంది శిక్షణ నిమిత్తం భద్రాచలం, ఇల్లందు పిఓ, ఏపిఓలు 30 , మే 01 తేదీలు, పినపాక పిఓ, ఏపిఓలు 01, 02 తేదీలలో శిక్షణ ఇవ్వడం కొరకు గత అసెంబ్లీ ఎన్నికలలో శిక్షణ ఇచ్చిన శిక్షణ కేంద్రాలలో(ఇల్లందు నియోజకవర్గ సిబ్బందికి టీటీ డబ్ల్యూ ఆర్ జెఆర్ కాలేజీ -సుదిమళ్ళ, భద్రాచలం నియోజకవర్గ సిబ్బందికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పినపాక నియోజకవర్గ సిబ్బందికి మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల) లో శిక్షణకు హాజరు కావాలని తెలిపారు. శిక్షణ ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.పై వారందరూ ఎవరి కేటాయించిన తేదీలలో శిక్షణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు.