ప్రతి ఒక్కరు ఓటు హక్కు ని వినియోగించుకోవాలి
ప్రతి ఒక్కరు ఓటు హక్కు ని వినియోగించుకోవాలి
అశ్వాపురం, శోధన న్యూస్ : త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా, వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు మంగళవారం అశ్వాపురంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి అశ్వాపురంలో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి, ఏడుళ్ళా బయ్యారం సిఐ కరుణాకర్, మణుగూరు సిఐ సతీష్ కుమార్, ఎస్ఐ లు సురేష్ ,తిరుపతి రావు, వెంకటప్పయ్య, రాజేందర్, సిఆర్పిఎఫ్ డిఎస్పి మేడం, సిఆర్పిఎఫ్ సిబ్బంది, టీఎస్పీఎస్ సిబ్బంది, అశ్వాపురం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.