ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘన సన్మానం
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘన సన్మానం
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ఉద్యోగ విరమణ పొందిన నలుగురు పోలీస్ అధికారులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సన్మానించి సత్కరించారు.పదవీ విరమణ పొందిన వారిలో ఎస్సై బి శ్రీనివాసరావు (పిసిఆర్),ఏఎస్సైలు పి వసంతరావు(ఎస్ బి), బి నరసింహ రావు (భద్రాచలం పట్టణ పిఎస్ ), వై.వి.వి.సత్యనారాయణ (బూర్గంపాడు పిఎస్)లు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతాయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖకు ఎనలేని సేవలందించి అధికారుల మన్ననలు పొంది పదవీ విరమణ పొందుతున్న అధికారులకు అభినందనలు తెలిపారు.పోలీస్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన వారు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా గడపాలని,వారి జీవితం ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన తర్వాత ప్రభుత్వం నుండి వారికి అందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా చూడాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి సాయి మనోహర్, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ ఏసోబు తదితరులు పాల్గొన్నారు.