తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి

పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి

-జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ :  ఎలక్షన్ డ్యూటీ లో ఉన్న ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా  శుక్రవారం తెలిపారు. ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసి ఉన్నారో వారు నియోజకవర్గ కేంద్రాల లో ఏర్పాటుచేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లో  ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య మొత్తం 4696 అని కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ హక్కు వినియోగం కొరకు జిల్లాలో ఐదు ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. పినపాక (110) అసెంబ్లీ నియోజకవర్గం కి గాను  మణుగూరు తహసిల్దార్ ఆఫీస్ పక్కన గల ఇందిరా క్రాంతి పథకం భవనం లో , ఇల్లందు (111) నియోజకవర్గాని కి తాసిల్దార్ ఆఫీస్ ఇల్లందు, కొత్తగూడెం (117) కి నియోజకవర్గం రెవెన్యూ డివిజనల్ ఆఫీసు కొత్తగూడెం, అశ్వరావుపేట (118) నియోజకవర్గం కి అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరావుపేట, భద్రాచలం (119) నియోజకవర్గం రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ భద్రాచలంలో  ఉదయం 9 గంటల నుండి 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *