ట్రాఫిక్ మళ్లింపుకు సహకరించాలి
ట్రాఫిక్ మళ్లింపుకు సహకరించాలి
-కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ట్రాఫిక్ మళ్లింపుకు వాహణదారులు, ప్రజలు సహకరించాలని కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో బహిరంగసభ నేపథ్యంలో సమయానుసారం పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్ : కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ పాల్వంచ వైపు నుండి కొత్తగూడెం మీదుగా విజయవాడ వైపుగా వెళ్ళు వాహనాలు ఓల్డ్ డిపో రోడ్డు నుండి భజన మందిర్ రోడ్డు మీదుగా సింగరేణి హెడ్ ఆఫీస్ నుండి రామవరం వైపుగా మళ్ళింపు భద్రాచలం,పాల్వంచ నుండి ఖమ్మం వెళ్ళు వాహనాలు ఇల్లందు క్రాస్ రోడ్డు నుండి టేకులపల్లి, ఇల్లందు మీదుగా ఖమ్మం వైపు మళ్ళింపు ఖమ్మం నుండి కొత్తగూడెం మీదుగా పాల్వంచ వైపు వెళ్ళు వాహనాలు విద్యానగర్ బైపాస్ రోడ్డు నుండి సింగరేణి హెడ్ ఆఫిస్,మెయిన్ హాస్పిటల్,భజన మందిర్ రోడ్డు,ఓల్డ్ డిపో రోడ్డు నుండి మొర్రేడు వాగు బ్రిడ్జ్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్డు నుండి పాల్వంచ వైపు మళ్ళింపు , విజయవాడ వైపు నుండి వచ్చు వాహనాలు సింగరేణి హెడ్ ఆఫీస్,భజనమందిర్ రోడ్డు మీదుగా ఓల్డ్ డిపో రోడ్డు నుండి మొర్రేడు వాగు బ్రిడ్జ్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్డు నకు మళ్లించడం జరుగుతుందన్నారు. సామాన్య ప్రజలకు,వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా కొత్తగూడెం పట్టణ మరియు ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న ట్రాఫిక్ డైవర్షన్ ను ప్రజలందరూ సహకరించాలని కోరారు.