మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ
మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ఈనెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపధ్యం లో మైక్రో అబ్జర్వర్లకు భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ లోని ఐడిఓసి మీటింగ్ హాల్ లో శనివారం శిక్షణ నిర్వహించారు. ఎన్నికల రోజు, ముందు రోజు వారు చేయవలసిన బాధ్యతలు వివరించడం జరిగింది. పోల్ రోజున ఉదయం 5:15 నిమిషాల నుంచి సాయంత్రం లాస్ట్ ఓటరు ఓటు వేసే వరకు ప్రతి నిమిషము ప్రతి సెకను నిషిత పరిశీలన చేయాల్సిన, వారికి ఇచ్చిన చెక్ లిస్ట్ పూర్తిచేసి అబ్జర్వర్ కి అందజేయాలని కోరడం జరిగినది. ఐదు నియోజకవర్గాలలో ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఉంటాయా అక్కడ వీరిని నియమించడం జరుగుతుంది. మైక్రో అబ్జర్వర్సుగా ఎల్ఐసి ఉద్యోగస్తులు, బ్యాంకు ఉద్యోగస్తులు, సింగరేణి ఉద్యోగస్తులు, హెవీ వాటర్ ఉద్యోగస్తులు తీసుకోవడం జరిగింది.