చెరువు లో అక్రమ మట్టి తోలకాలు పట్టివేత
చెరువు లో అక్రమ మట్టి తోలకాలు పట్టివేత
జెసిబి, 5ట్రాక్టర్లను సీజ్ చేసిన ఎస్ ఐ. రాజేందర్
కరకగూడెం శోధన న్యూస్: కరకగూడెం మండలం మోతే చెరువు నుంచి అక్రమంగా మట్టితోలకాలు తోలుతుండగా పద్మాపురం నుంచి ఎస్సై రాజేందర్ తమ సిబ్బందితో వస్తుండగా మట్టితోలకాల ప్రదేశాలకు వెళ్లి పత్రాలను అడగగా వారి దగ్గర సరైన పత్రాలు లేకపోవడంతో ఒక జెసిబి, ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేందర్ మాట్లాడుతూ. వాహనదారులు తప్పకుండా వాహనాల వద్ద బండి కి సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని లేని పక్షంలో వారిపైన చర్యలు తీసుకోబడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.