ఎక్సెలెంట్ విద్యార్థులను అభిందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
• పాలిటెక్నిక్ రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందనలు
తెలంగాణ పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు జూన్ 3 సోమవారం వచ్చాయి. పినపాక మండలం లో గల ఎక్సెలెంట్ బాషా హై స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో స్టేట్ 5వ ర్యాంక్, అదేవిదంగా స్టేట్ 722 వ ర్యాంకులు వచ్చిన సందర్బంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకొని ఇద్దరు విద్యార్థులను అభినందించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పుడు ఎలా ఐతే మంచి ర్యాంకులు సాధించించారో ముందు ముందు కూడా ఇలాంటి విజయాలు ఎన్నో సాధించి మీ తల్లిదండ్రులకు, మీ పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యతలు తీసుకురావాలని ఆయన విద్యార్థులను కోరారు.
ఈ కార్యక్రమం లో ఎక్సెలెంట్ గ్రూప్ అఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ ఎండీ ఖాదర్, డైరెక్టర్స్ ఎండీ యాకుబ్ షరీఫ్, బండారు నరేంద్ర, ప్రిన్సిపాల్ సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు