నకిలీ విత్త నాలు విక్రయిస్తే చర్యలు తప్పవు
నకిలీ విత్త నాలు విక్రయిస్తే చర్యలు తప్పవు
-టాస్క్ ఫోర్స్ అధికారిణి అబ్దుల్ బేగం
మణుగూరు, శోధన న్యూస్: ఫెర్టిలైజర్ దుకాణాల యజమానులు నకిలీ విత్త నాలు విక్రయిస్తే చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ అధికారిణి అబ్దుల్ బేగం హెచ్చరించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని పలు ఫెర్టిలైజర్ దుకా ణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకు సంబంధించిన రికార్డులను సక్రమంగా మెయింటెన్ చేయాలని, రైతులు కొన్న విత్తనాలు, ఎరువులకు రశీదులు అందించాలన్నారు. కాలం చెల్లిన, నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయించవద్దని సూచించారు. ప్రభు త్వ నిబందనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ తనిఖీ లో మణుగూరు ఏఓ రామశివరావు తదితరులు పాల్గొన్నారు.