రాజీ మార్గమే రాజమార్గం
రాజీ మార్గమే రాజమార్గం
మణుగూరు, శోధన న్యూస్ : కేసుల విషయంలో రాజీ మార్గమే రాజ మార్గమని మణుగూరు మెజిస్ట్రేట్ కే సూరి రెడ్డి తెలిపారు. శనివారం మణుగూరు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మెజిస్ట్రేట్ కే సూరి రెడ్డి మాట్లాడుతూ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కేసుల విషయంలో రాజీమార్గమే రాజ మార్గమని పేర్కొన్నారు. మణుగూరు కోర్ట్ పరిడీలోని మణుగూరు, ఆశ్వాపురం, పినపాక, కరకగూడెం పోలీస్ స్టేషన్ల లో మెగా లోక్ అదాలత్ లో మొత్తం 373 కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు బార్ అసోసియేషన్ అద్యక్షుడు చిర్ర రవికుమార్, న్యాయవాదులు సర్వేశ్వరరావు, రామ్మోహనరావు, పోశం భాస్కర్, కూర్మా విజయరావు, వాసవి, సంధ్య, రుద్ర వెంకట్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.