మతపెద్దలతో శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు
మతపెద్దలతో శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు
పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : డిఎస్పీ రెహమాన్
కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు రాబోయే బక్రీద్ పండుగ నేపథ్యంలో కొత్తగూడెం పట్టణంలోని మత పెద్దలతో కొత్తగూడెం 1టౌన్ పోలీసులు పీస్ కమిటీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు .ఈ సమావేశంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.మత విద్యేషాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ సోదరుభావంతో పండుగలను జరుపుకోవాలని సూచించారు.మత విద్వేషాలకు సంబంధించి ఎక్కడైనా గొడవలు జరిగితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐ కరుణాకర్,ఎస్సైలు రవి,విజయ కుమారి , తదితరులు పాల్గొన్నారు.