ఏజెన్సీ ప్రాంతాల్లోని వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ఏజెన్సీ ప్రాంతాల్లోని వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
-భద్రాచలం ఐటిడిఏ పీఓ ప్రతీక్ జైన్
భద్రాచలం, శోధన న్యూస్ : పలుచోట్ల వర్షాలు పడుతున్న నేపథ్యం లో ఆదివాసి గిరిజన గ్రామాలలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి గిరిజనులకు వైద్య సేవలు అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ గురువారం తెలిపారు. మారుమూల అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసి గిరిజన కుటుంబాలకు వైద్య సిబ్బంది మరియు వైద్యాధికారులు తాము పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్థానికంగా ఉంటూ 24 గంటలు గిరిజనులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరియు సబ్ సెంటర్ పరిధిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు గిరిజన ప్రజలకు తరుణ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ సమయపాలన పాటించాలని అన్నారు. ఎలాంటి జ్వర మైన రక్త పూతలు స్వీకరించి మలేరియా ఉన్నట్లయితే పూర్తి చికిత్స అందించి, మిగతా వ్యాధుల కోసం టీ హబ్ కి రక్త నమూనాలు పంపించి రిపోర్టులు వచ్చాక పూర్తి చికిత్స అందే విధంగా గిరిజన ప్రజలకు సహాయ, సహకారాలు అందించాలని అన్నారు. గ్రామ పంచాయతీలో మరియు మండల హెడ్ క్వార్టర్ లలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది లైన్ డిపార్ట్మెంట్ తో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి, గిరిజన ప్రజల ఆరోగ్య స్థితిగతుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.