karakagudem

గ్రామాల్లో బెల్టుషాపుల జోరు జోరుగా సాగుతున్నాయి.

గ్రామాల్లో బెల్టుషాపుల జోరు జోరుగా సాగుతున్నాయి.

గల్లీగల్లీలో మందు ఏరులై పారుతుంది. అర్ధరాత్రి వరకు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.

ఎమ్మార్పీ కన్నా రేటు పెంచి మద్యంపై అదనపు లాభాలు ఆర్జిస్తున్నారు.

దీంతో మద్యం బాబుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.

అప్పులు చేసి తాగడంతో కాపురాలు వీధిపాలవుతున్నాయి.

పట్టపగలే బెల్ట్‌ షాపులను నడుపుతున్నా పట్టించుకోని అధికారులు.

కరకగూడెం,శోధన న్యూస్: కరకగూడెం మండల పరిధిలోని గ్రామాల్లో బెల్టు షాపుల దందా జోరు జోరుగా సాగుతున్నాయి. మద్యం అక్రమ విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నా ఎక్సైజ్‌ శాఖ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిరాణ దుకాణాల మాటున బెల్టుషాపులు ఏర్పాటు చేసి రాత్రి పగలు అనే తేడా లేకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అర్ధరాత్రి వరకు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.

బెల్ట్‌షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతూ మందుబాబుల జేబులు గుల్ల చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఊళ్లల్లో ఎక్కడపడితే అక్కడ మద్యం దొరుకుతుండటంతో యువత పెడదారి పడుతున్నారు. మద్యానికి బానిసై కుటుంబాలను పట్టించుకోకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. మండలంలోని ఏ గ్రామానికి వెళ్లినా వీధివీధినా బెల్టు దుకాణాలు దర్శనమిస్తున్నాయి. బాహాటంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా అబ్కారీ పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మద్యాన్ని విక్రయిస్తున్నా.. వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రతి గ్రామంలో కనీసం రెండు నుంచి 10 వరకు బెల్టుషాపులు నడుస్తున్నాయి. విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలు కుటుంబాల్లో మద్యం చిచ్చు పెడుతున్నా .పట్టించుకోని అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *