కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలుచెయ్యాలి .
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలుచెయ్యాలి .
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద మధు.
కరకగూడెం,శోధన న్యూస్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినా 100 రోజుల్లో అన్ని పథకాలు అమలు చేస్తానని చెప్పి ఆరు నెలలు కావస్తున్న ఇంకా మోక్షం లేదని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద మధు ఆరోపించారు. ఇచ్చిన హామీలు వడ్లకు బోనస్ , ఒకేసారి రుణమాఫీ, సీజన్ వారిగా రైతు భరోసా, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 ,వృద్ధులకు 4000 , వికలాంగులకు 6000 ,వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ తరపున పోరాటం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.