తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలి 

కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలి 

 మణుగూరు, శోధన న్యూస్ :  ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు ముద్దా భిక్షం, ఇఫ్టూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ మధుసూదన్ రెడ్డి,షేక్ యాకూబ్ షావలి పిలుపునిచ్చారు.  ఆదివారం మణుగూరులోని డివి ఫంక్షన్ హాల్ పెనుగొండ. నాగరాజు నగర్ లో ఇఫ్టూ మణుగూరు ఏరియా అధ్యక్షులు జెల్ల అశోక్ అధ్యక్షతన జరిగిన ఇఫ్టూ ఏరియా ఐదవ మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. ముందుగా అశోక్ జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం అమరవీరులకు నివాలలర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను పెంచి, కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరసి, కార్మిక హక్కులను కాపాడవలసిన ప్రభుత్వాలు, అందుకు విరుద్ధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ, పర్మినెంట్ కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల సంఖ్యను పెంచుతూ, ముందు తరాల కార్మికవర్గం పోరాడి, రక్త తర్పణ చేసి సాధించిన హక్కులను, చట్టాలను కాల రాసి, కార్మికుల శ్రమను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు.పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు ఒకే రకమైన పని చేస్తే వారి వేతనాలలో కూడా తేడా ఉండకూడదని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును పాలకులు అమలు జరపడం లేదని విమర్శించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల కోసం, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఐ ఎఫ్ టి యు నిర్వహించే పోరాటాలలో, ఆందోళనలో కార్మికవర్గం భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ మహాసభలో  ఇఫ్టూ జిల్లా నాయకులు బి మల్సూర్,  మిట్టపల్లి రాజేందర్, ఏరియా నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు, పి లక్ష్మీనారాయణ, ఆర్ వెంకటేశ్వర్లు, విజయ్, వి జానయ్య, జే  యాకయ్య, పి  సంజీవరెడ్డి, పి  నరసింహారావు, ఆర్  బిక్షం, నరసమ్మ, సరస్వతి, సంపత్, భాస్కర్, రామకృష్ణ, సంజీవ, ధనుంజయ్, రాజ్ కుమార్, వంశీ, సతీష్ బాబు, మధు, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *