గ్రామీణ వైద్యులపై దాడులు ఆపాలి
గ్రామీణ వైద్యులపై దాడులు ఆపాలి.
కరకగూడెం,శోధన న్యూస్:కరకగూడెం మండల కేంద్రంలో మండలంలో ని గ్రామీణ వైద్యులు సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రఫీ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రధమచికిత్స అందిస్తున్న ఆర్ఎం పిఎంపి లను గుర్తించి శిక్షణ, గుర్తింపు ఇవ్వాలని అన్నారు గ్రామాల్లో ఏళ్ల తరబడి సేవలందిస్తున్నామని ఏనాడు ప్రభుత్వానికి భారం కాలేదని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గ్రామీణ వైద్యుల సేవలను గుర్తించి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ అనివార్య కారణాలవల్ల అది పూర్తి కాలేదు .తదుపరి వచ్చిన ప్రభుత్వం కూడా గుర్తింపు ఇస్తామని చెప్పి కాలయాపన చేసిందని అన్నారు.
గ్రామీణ వైద్యులను, దొంగలు, రౌడీ షీటర్ లాగా చిత్రీకరిస్తూ వారిపై దాడులు.
గత ఐదు నెలలుగా ఎన్ఎంసి, టి ఎస్ ఎం సి వారు గ్రామీణ వైద్యులను, దొంగలు, రౌడీ షీటర్ లాగా చిత్రీకరిస్తూ వారిపై దాడులు నిర్వహిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.ఆర్ఎంపీ వ్యవస్థ కొత్తగా వచ్చింది ఏమీ కాదు ఎప్పటినుంచో ఉంది శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎంపీలకు చట్ట మద్దతు కల్పిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముత్యం సేవలందిస్తున్న గ్రామీణ వైద్యులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష భూమికంగా వ్యవహరిస్తుందని అన్నారు.
ఎన్నికల ముందు ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేస్తామని హామీ
ఎన్నికల ముందు ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలల్లోనే గ్రామీణ వైద్యులకు గుర్తింపు, శిక్షణ ఇవ్వకుండానే దాడులు చేయడం గ్రామీణ వైద్యులు రోగులకు ప్రాథమికంగా చికిత్స అందించి కాపాడతారే తప్ప వారి హాని కలిగించాలని విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. గ్రామీణ వైద్యులపై తెలంగాణ వైద్య మండలి దాడులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు..ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి గుర్తింపు కార్డు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ సొందుపాషా, కృష్ణారెడ్డి,సారిక లింగయ్య. కాంపాటి శ్రీనివాస్, జి రామలింగం, రాజు, షేక్ అబ్దుల్లా, జాడి విజయ్ ,కోటి తదితరులు పాల్గొన్నారు.