muluguTelangana

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ

బక్రీద్ సందర్బంగా ముస్లిం సోదరులతో పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.

ఏటూరునాగారం మండల ముస్లిం ప్రజలకు ఈద్-ఉల్-అదా ముబారక్.. బక్రీద్ శుభాకాంక్షలు.

బక్రీద్ పండుగ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు  మాట్లాడుతూ…త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా ఏటూరునాగారం మండల ముస్లిం సోదరులకు, ముస్లీం కుటుంబ సభ్యులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్తల అచంచలమైన భక్తి, త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. తమకు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని చాటిచెపుతోందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండలంలోని జిల్లా నాయకులు, మండల నాయకులు, మండల అనుబంధ సంఘాల నాయకులు, గ్రామ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం సోదర, సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు :అశోక్

 ములుగు జిల్లా కేంద్రంలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్  ముస్లిం సోదర, సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *