హైదరాబాద్ లో బారీ వర్షం ..ప్రజలు జాగ్రతగా ఉండాలి : అధికారులు
హైదరాబాద్ లో బారీ వర్షం ..ప్రజలు జాగ్రతగా ఉండాలి : అధికారులు
హైదరాబాద్ లో బారీ వర్షం. మధ్యాహ్నం 3 గంటలకు తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. గచ్చిబౌలి, లింగంపల్లి, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట,లక్డీకపూల్,నాంపల్లి, సికింద్రాబాద్, అల్వాల్, జూబ్లీహిల్స్,బంజారహిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్,నాంపల్లి, సికింద్రాబాద్, అల్వాల్, బాల్ నగర్, బోయిన్ పల్లి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, లో వర్షం దంచి కొడుతోంది. రోడ్లపై వర్షం నీళ్లు నిలిచిపోవడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
భారీ వర్షాలు
తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది IMD. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కొన్నిప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమ,నైరుతి దిశల నుంచి ఈదురుగాలులు వీస్తున్నట్టు చెప్పారు.