ఆర్టీసీ బస్ ను ప్రారంభించిన మంత్రి డాక్టర్ దనసరి అనసూయ
ఆర్టీసీ బస్ ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ప్రాంగణం లో మంగపేట మండలం నర్సింహ సాగర్ గ్రామానికి వెళ్ళే బస్ ను పూజ చేసి బస్ ను రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు.
అనంతరం మంత్రి సీతక్క బస్ లో ప్రయాణించి జిల్లా కలెక్టర్ ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏటూరు నాగారం మండల కేంద్రములో బస్ డిపో ఏర్పాటు , ములుగు జిల్లా కేంద్రములో ఉన్న బస్ స్టాండ్ ను మోడల్ బస్ స్టాండ్ గా తిరిచిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ గారితో పాటు ఆర్టీసీ అధికారులకు పాల్గొన్నారు.