అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యాపారస్తులు.
అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యాపారస్తులు.
– క్వాలిటీ తక్కువ సిమెంట్, ఐరన్ అమ్మకాలు.?
కరకగూడెం,శోధన న్యూస్: కరకగూడెం మండల కేంద్రంలో సిమెంట్ , రాడ్డు ,రేకులు, ఎలక్ట్రికల్ సామాన్లు అమ్మే వ్యాపారస్తులు ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు.
అత్యధిక ధరలకు వస్తువులను అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్నారు. కరకగూడెం మండలంలోని సిమెంట్, ఐరన్ వ్యాపారస్తులు అమాయక ప్రజలను మోసం చేస్తు క్వాలిటీ లేని సిమెంట్, ఐరన్ ఇస్తూ ఇదోరకమైన మోసానికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
రూ,,400 నుండి 500 రూపాయలు కిరాయి రూపకంగా దోసుకుంటున్నారు.
వ్యాపారానికి సొంత వెహికల్స్ నియమించుకొని కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామనికి కూడ రూ,,400 నుండి 500 రూపాయలు కిరాయి రూపకంగా దోసుకుంటున్నారు. షాపు యాజమాన్యం నిలువున దోచుకుంటున్నా సంబంధిత అధికారులు దృష్టి సారించి దోపిడిని అరికట్ట వలసిందిగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.