ఎమ్మెల్యే పాయంకు పరామర్శ
ఎమ్మెల్యే పాయంకు పరామర్శించిన సిపిఐ నేతలు
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాతృమూర్తి పాయం రాములమ్మ అనారోగ్యం తో మరణించారు. ఈ విషయం తెలిసిన సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా ,సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య లు మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ని వారి నివాసానికి వెళ్ళి పరామర్శించారు. పరామర్శించిన వారిలో సిపిఐ మండల కార్యదర్శి జంగం మోహన్ రావు, నాయకులు సోందే కుటుంబరావు, ఎస్ కే సర్వర్, మంగి వీరయ్య, కొత్తపల్లి సీతారాములు, ఎడారి రమేష్, కనితి సత్యం తదితరులు ఉన్నారు.