మున్నేరు నుంచి పాలేరు వరకు గ్రావిటీ కాలువకు ప్రతిపాదన
మున్నేరు నుంచి పాలేరు వరకు గ్రావిటీ కాలువకు ప్రతిపాదన
– పొంగులేటి ప్రసాద్ రెడ్డి వద్ద ఇరిగేషన్ అధికారుల ప్రస్తావన
కూసుమంచి : మున్నేరు నుంచి పాలేరు వరకు గ్రావిటీ కాలువను నిర్మించడం ద్వారా పాలేరు నియోజకవర్గ ప్రజలకు సాగునీరు, తాగునీరుకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి వద్ద ఇరిగేషన్ డీఈ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు ప్రస్తావించారు. దీనికి పొంగులేటి ప్రసాద్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసి ఈ విషయాన్ని తన సోదరుడు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో చర్చించి అమలు చేద్దామని హామీ ఇచ్చారు.
నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి పొంగులేటి కట్టుబడి ఉన్నారని ప్రసాద్ రెడ్డి తెలిపారు. పాలేరు క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అయిన సందర్భంగా పై విషయం చర్చకు వచ్చింది.