విందుకు హాజరైన ఎంపీ బలరాం నాయక్
విందుకు హాజరైన ఎంపీ బలరాం నాయక్
పినపాక నియోజకవర్గం, శోధన న్యూస్ : మానుకోట కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన పోరిక బలరాం నాయక్ మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు భజన సతీష్ కుమార్ ఇంటికి అల్పాహార విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ మండలంలో కాంగ్రెస్ కు మెజారిటీ ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను, ప్రజలకు ఋణపడి ఉంటానన్నారు. మండల అభివృద్ధి విషయంలో కేంద్ర నిధులు మంజూరు చేయడం కోసం శాయశక్తుల కృషి చేస్తానన్నారు. అనంతరం ఎంపీ బలరాం నాయక్ ను నాయకులు శాలువా తో సన్మానించి భద్రాద్రి సీతారామచంద్రస్వామి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో భజన ప్రసాద్, గుండె ఎంకన్న, డేగల రాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.