ప్రపంచంలోనే టీజేఎఫ్‌ది ఒక చరిత్ర.
ప్రపంచంలోనే టీజేఎఫ్‌ది ఒక చరిత్ర.
టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) ఖమ్మం, భద్రాద్రి జిల్లాల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ.
ఖమ్మం: దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం, అక్రిడిటేషన్ల మంజూరు, పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఫండ్, జర్నలిస్టుల హెల్త్ కార్డుల సాధన కోసం జర్నలిస్టులు మరో వీరోచిత పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఖమ్మం, భద్రాద్రి జిల్లాల విస్తృతస్థాయి సమావేశం మంగళవారం ఖమ్మంలోని డిపిఆర్‌సి భవనంలో ఘనంగా జరిగింది. ఉమ్మడి ఖమ్మం, భద్రాది జిల్లాల నుండి వందలాదిగా తరలివచ్చిన జర్నలిస్టుల సమావేశానికి టియుడబ్ల్యూజే (టీజేఎఫ్) యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ అధ్యక్షత వహించారు.
టీజేఎఫ్ ఒక చారిత్రక నేపథ్యం కలిగిన జర్నలిస్ట్ యూనియన్.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ హజారి, టెంజు రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, టెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, రాష్ట్ర కోశాధికారి యోగానంద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల కళ్యాణ్ చక్రవర్తి ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అల్లం నారాయణ మాట్లాడుతూ… టీజేఎఫ్ ఒక చారిత్రక నేపథ్యం కలిగిన జర్నలిస్ట్ యూనియన్ అని అన్నారు. గతంలో ప్రపంచంలోనే మరే దేశంలోనూ ఇలాంటి చరిత్ర నిర్మించబడలేదని అన్నారు. ఇప్పటివరకు జర్నలిస్టుల స్వేచ్ఛ అణచివేత నిర్బంధం హక్కుల సాధన కోసం జరిగిన జర్నలిస్టు ఉద్యమాల్ని చూశామనీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలోనే మరెక్కడ లేని విధంగా ఒక రాష్ట్ర ప్రజల అస్తిత్వం కోసం పోరు సలిపిన ఘనమైన చరిత్ర టీజేఎఫ్ జర్నలిస్టుల దేనని తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ గుర్తు చేశారు.
జర్నలిస్టుల ఉద్యమాల చరిత్రలో పదివేల మందితో ఒక మహాసభ.
తెలంగాణ రాష్ట్రంలో మహోన్నతంగా సాగించిన ఉద్యమం టీజేఎఫ్ జర్నలిస్టులకే దక్కుతుందన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో చలన శీలంగా ఆలోచించి తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకుల మధ్య నిర్మించిన ఒక వీరోచిత పోరాట చరిత్ర టీజేఎప్ దేనని అన్నారు. మన జర్నలిస్టులు ఒక చరిత్ర నిర్మాతలని ఆయన అన్నారు. మన యూనియన్ వెనుక ఒక సుదీర్భమైన పోరాట చరిత్ర ఉందని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. జర్నలిస్టుల ఉద్యమాల చరిత్రలో పదివేల మందితో ఒక మహాసభ నిర్వహించిన ఘనమైన చరిత్ర మనదేనన్నారు. సభలో పాల్గొన్న 10వేల మంది ప్రజలు కాదని కలం కార్మికులని అంతమంది జర్నలిస్టులతో పోరాడి నిర్మించిన యూనియన్ మనదేనన్నారు. ఢిల్లీలో 2వేల మందితో ధర్నా నిర్వహించి సరికొత్త జర్నలిస్టు ఉద్యమాలకు ఊపిరి ఊదామని అల్లం నారాయణ స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంత విలేకరులదే ప్రధాన పాత్ర.
ఇంత పెద్ద విజయం సాధించిన యూనియన్ చరిత్ర వెనుక గ్రామీణ ప్రాంత విలేకరులదే ప్రధాన పాత్రని అన్నారు. ఒక వైపు తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడుతూనే మరోవైపు ప్రతిపక్ష పాత్ర పోషించామన్నారు. స్వార్థ ప్రయోజనం కోసం రాష్ట్ర సాధనలో తమ పదవులకు రాజీనామా చేయని నాయకుల ఇండ్ల ముందు ధర్నాలు నిర్వహించి వారిని పదవులకు రాజీనామా చేయించిన చరిత్ర కూడా మనదేనన్నారు. కడుపు కొట్టుకొని మన సమస్యలను వదిలి రాష్ట్ర సమస్యలపై పోరాడిన చరిత్ర ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, జర్నలిస్ట్ సంక్షేమ నిధి, అక్రిడిటేషన్లు ఈ నాలుగు అంశాలపై మరో చరిత్రకు, మరో పోరాటానికి జర్నలిస్టులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తాను మీడియా అకాడమీ చైర్మన్‌గా ఉన్న సమయంలో 100 కోట్లతో జర్నలిస్ట్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసుకున్నామని రూ.15 కోట్లతో మీడియా అకాడమీ భవనం నిర్మించామని అన్నారు.