రామోజీరావు ,తమ్మిశెట్టి వెంకటేశ్వర్లకు నివాళులు.
రామోజీరావు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లకు నివాళులు.
ఖమ్మం డిపిఆర్సి భవనంలో జరిగిన టియుడబ్ల్యూజే (టీజేఎఫ్) ఖమ్మం భద్రాద్రి జిల్లాల విస్తృత స్థాయి సమావేశంలో తొలిత ఇటీవల చనిపోయిన ఈనాడు సంస్థల అధినేత జర్నలిస్ట్ రామోజీరావు, భద్రాద్రి జిల్లా ఇల్లందుకు చెందిన జర్నలిస్ట్ తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు మృతికి సమావేశం ఘనంగా నివాళులర్పించింది. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాష్ట్ర బాధ్యులను ఖమ్మం భద్రాది జిల్లాల జర్నలిస్టు యూనియన్లు శాలువాలు పూల బొకేలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు బొల్లం శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి, లింగయ్య, శెట్టి రజనీకాంత్, ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా యూనియన్ నాయకులు వనం నాగయ్య, అమ్మా న్యూస్ బ్యూరో మందుల ఉపేందర్, మహిళా జర్నలిస్టు భారతి, పిన్ని సత్యనారాయణ, ఆర్టివి ఉదయ్, బీఆర్కే న్యూస్ శ్రీధర్ శర్మ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షులు యలమందల జగదీష్, అశోక్, కెరటం న్యూస్ శ్యామ్, వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగరాజు, వివిధ పత్రికల జిల్లా బ్యూరోలు, స్టాఫర్లు, మండల, నియోజకవర్గ స్థాయి విలేకరులు పాల్గొన్నారు.