ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పరిధిలోని రావి నారాయణరెడ్డి కాలనీలో సిపిఐ ఆధ్వర్యంలో భూదాన భూమిలో పదివేల మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు .వారికి న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, ముత్యాల యాదిరెడ్డి కలిశారు.