గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై కఠిన చర్యలు.
గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
పాల్వంచ,టేకులపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు రూ.90,00,000/- విలువ గల 360 కేజిల గంజాయిని పోలీసులు స్వాధీనం .
గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనను వెల్లడించారు.టాస్క్ ఫోర్స్ పోలీసుల ప్రత్యేక నిఘాతో గంజాయి రవాణాను సమర్థవంతంగా అడ్డుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకుని భారీగా గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
పాల్వంచ పట్టణంలోని GCC గౌడౌన్ ఎదురుగా
పాల్వంచ పట్టణంలోని GCC గౌడౌన్ ఎదురుగా సాయంత్రం 4 గంటల సమయంలో పాల్వంచ ఎస్సై-2 రాఘవ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా ఒక మారుతి బలెనో TS10CDT/R9062 ఆను నంబరు గల కారులో తరలిస్తున్న 202 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.దీని విలువ సుమారుగా రూ.50,55,000/-లు ఉంటుంది. ఇట్టి గంజాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,డొంకరాయి అటవీ ప్రాంతం నుండి మెగావత్ జైపాల్,S/o. లక్య,34yrs,,మోమిన్ పేట మండల్,వికారాబాద్ జిల్లా అను వ్యక్తి 100 ప్యాకెట్ల నిషేధిత గంజాయిని కారులో తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
టేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట్యా తండా వద్ద ఎస్సై సైదా రవుఫ్ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా ఒక మారుతి బ్రెజా TG03 0141లో కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు పెనుగొండ వెంకట రాజు మరియు బోదాసు తిరుపతిలు 79 ప్యాకెట్లలో 158 కేజీల గంజాయిని ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి ప్రాంతం నుండి మహారాష్ట్ర,షోలాపూర్ నకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది.దీని విలువ సుమారుగా రూ.39,50,000/- ఉంటుంది.