HyderabadTelangana

రైతులకు బ్యాంకులు రుణాలిచ్చేందుకు వెనకడుగు

రైతులకు బ్యాంకులు రుణాలిచ్చేందుకు వెనకడుగు

రైతులకు బ్యాంకులు రుణాలిచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అసక్తిక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని మ్యారీగోల్డ్ హోటల్‌లో 41వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి ఆయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిల్లాలో ఆయిల్ ఫాం పంటలు

ఈ సందర్భంగా 2024-2025 వార్షిక రుణ ప్రణాళికపై ఆయన మట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫాం సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించామని తెలిపారు. ఇక ప్రతి జిల్లాలో ఆయిల్ ఫాం పంటలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఎవరైతే రైతులు ఆయిల్ ఫాం సాగు చేయాలనుకుంటారో వారికి బ్యాంకర్లు సహరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ క్రమంలో వ్యవసాయం, అనుంబంధ రంగాలకు బ్యాంకులు రుణాలు పెంచాలన్నారు. దశాబ్ధాలుగా రైతే రాజు అంటూ వస్తున్నామని ప్రస్తుతం ఆ ప్రభవాన్ని బ్యాంకులు తగ్గిస్తున్నాయని తుమ్మల అన్నారు. అదేవిధంగా బ్యాంకు రుణాల గణాంకాలు చూస్తే భయంగా ఉందని చమత్కరించారు.

బహుళ జాతి, ఇన్‌ఫ్రా కంపెనీలకు బ్యాంకులు రూ.వేల కోట్ల రుణాలు ఇస్తున్నాయని, కానీ రైతులు రుణాలు ఇచ్చేందుకు మాత్రం అవే బ్యాంకులు వెనకడుతున్నాయని అన్నారు.

పెద్దలకు ఒక న్యాయం.. పేదలకు ఒక న్యాయం ఉండకూడదని తెలిపారు. రైతులు వన్ టైం సెటిల్‌మెంట్ చేయమంటే బ్యాంకులు నేటికీ స్పందించడం లేదని అన్నారు. నిబంధనల ప్రకారమే బ్యాంకర్లు వ్యవహరించాలని మంత్రి తుమ్మల సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *