నులిపురుగుల నివారణ పై అవగాహన ర్యాలీ
నులిపురుగుల నివారణ పై అవగాహన ర్యాలీ
మణుగూరు, శోధన న్యూస్ : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యం లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండల పరిధిలో గల అన్ని ఆరోగ్య ఉపకేంద్రాలలో,ఆమ్ సెంటర్ లో సికీల్ సెల్ పరీక్షలు చేసి వారికి కార్డులు అంద చేయటం జరిగింది. 20 వ తేదీన జరగబోయే జాతీయ నులిపురుగుల దినోత్సవ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని,అన్ని శాఖల వారు సమన్వయం తో పనిచేసి ఒకటి నుండి 19సంవత్సరాల లోపు పిల్లలందరికీ అల్బెండేజోల్ మాత్రలు ఇప్పించాలని, అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఈ కార్యక్రమం జరుగుతుందని పిహెచ్ సి విద్యాధికారి డాక్టర్ శివ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమం లో డాక్టర్ నిషాంత్ రావు , సిబ్బంది పాల్గొన్నారు.