జాతీయ నులిపురుగుల కార్యక్రమం
జాతీయ నులిపురుగుల కార్యక్రమం
జాతీయ నులిపురుగుల కార్యక్రమం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ పాల్వంచ నందు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జితేష్ వి .పాటిల్ భద్రాద్రి, కొత్తగూడెం , ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ పిల్లలందరూ ఆరోగ్యం మరియు విద్య మీద శ్రద్ధ వహించాలని ప్రతి ఒక్కరూ శుభ్రత ,పరిశుభ్రతను పాటించాలన్నారు .
ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని ,తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా శ్రీ కె. చంద్రశేఖర్ గారు జెడ్పీ చైర్మన్ ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరూ చదువుకొని దేశం కొరకు పాటుపడాలని తెలిపారు .200 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు.
ఈ కార్యక్రమంలో వి. విజేత ,పి. దుర్గా , జె .దుర్గ , ఎన్.క్రాంతి బి. నాగేశ్వరరావు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ తరపున ఇంచార్జి డి.ఎం. అండ్ హెచ్ .ఓ .డాక్టర్. ఎల్. భాస్కర్ మరియు డిప్యూటీ డి.ఎం. అండ్ .హెచ్ .ఓ .డాక్టర్ సుకృత ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ మధువరన్ , డాక్టర్ బాలాజీ , సి. హెచ్. ఓ. నాగభూషణం డిప్యూటీ డెమో, ఎం.డి .ఫయాజ్ మొహిద్దీన్ పాల్గొన్నారు.