మరణించిన జర్నలిస్టుల పిల్లలకు మీడియా అకాడమీ చేయూత.
మరణించిన జర్నలిస్టుల పిల్లలకు మీడియా అకాడమీ చేయూత.
మరణించిన జర్నలిస్టుల కుటుంబాల పిల్లలకు చేయూతను అందించేందుకు తెలంగాణ మీడియా అకాడమీ ముందుకొచ్చిందని మీడియా అకాడమీ కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
మరణించిన జర్నలిస్టుల కుటుంబాల పిల్లలకు ప్రతినెల రూ.1000 చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరానికి(2024-25) సంబంధించి బోనఫైడ్ సర్టిఫికెట్ల వివరాలతో ఈ నెల 28వ తేదీ లోపు సెక్రటరీ తెలంగాణ మీడియా అకాడమీ ఇంటి నెంబర్ 5-9-166 చాపల్ రోడ్డు, నాంపల్లి, హైదరాబాద్ 500001 చిరునామాకు రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
మరణించిన కుటుంబాల జర్నలిస్టుల పిల్లల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.