మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
-మణుగూరు ఎంఈఓకి వినతి పత్రం అందజేత
మణుగూరు, శోధన న్యూస్ : మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మణుగూరు ఎంఈఓ వీరాస్వామికి వినతిపత్రం సమర్పించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు జిలకర పద్మ మాట్లాడుతూ. రాష్ట్రంలో మధ్యాహ్నం భోజనం వర్కర్ల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఆన్న చందంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, పదివేల రూపాయలు గౌరవ వేతనం, సపరేటు గుడ్లు బిల్లులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరారు. ఈనెల 24వ తారీఖున జరగబోయే కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆమె కార్మికులు కోరారు. ఈ కార్యక్రమం లో సిఐటి జిల్లా నాయకులు సత్ర పల్లి సాంబశివరావు. మధ్యాహ్నం భోజనం అధ్యక్ష కార్యదర్శులు. శైలజ. అరుణ. మునెమ్మ. సీతమ్మ. నాగమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.